సాధారణంగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయి అంటే ఆ హడావుడి చిత్ర యూనిట్ లో కంటే అభిమానుల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. కటౌట్స్, బ్యానర్స్ అంటూ హంగామా చేస్తుంటారు. ఇక తమిళనాడు లో అభిమానం డోస్ కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే తన కోసం ఎవరు కూడా కటౌట్స్ రెడీ చేయవద్దని సూర్య అభిమానులను కోరడం ఒక్కసారిగా కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఓ విధంగా సూర్య తీసుకున్న నిర్ణయానికి అందరి నుంచి ప్రశంసలు అందుతున్నాయి. సూర్య నెక్స్ట్ సినిమా కాప్పాన్ ( తెలుగులో బందోబస్త్) భారీగా రిలీజ్ అవుతుండడంతో ఫ్యాన్స్ లో కొత్త సందడి నెలకొంది. భారీ కటౌట్స్ బ్యానర్స్ తో అభిమానులు సిద్ధమవుతున్నట్లు తెలుసుకున్న సూర్య వారికి తన విన్నపాన్ని తెలియజేశాడు. “నాకు కటౌట్స్, బ్యానర్స్ లాంటివి ఏమి వద్దు. అవి నన్ను సంతృప్తి పరచవు. ఆ డబ్బుతో సేవా కార్యక్రమలకు ఉపయోగించండి” అని సూర్య వారిని కోరడంతో సోషల్ మీడియాలో సూర్య అభిమానులు అందుకు మద్దతు పలుకుతున్నారు.


