$3 మిలియన్ క్లబ్ లో చేరిన సాహో

0
4040

రెబల్ స్టార్ సాహో సినిమాతో అమెరికాలో మరోసారి ప్రభాస్ తన బాక్స్ ఆఫీస్ స్టామినా చూపించాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సాహో శనివారం నాటికి $3 మిలియన్ క్లబ్ లో చేరింది. ఓవర్సీస్ లో భారిగా విడుదలైన సాహో ప్రీమియర్స్ తోనే సాలీడ్ కలెక్షన్స్ ని రాబట్టింది. ఇక ప్రభాస్ గత సినిమాలు కూడా యూఎస్ లో మంచి వసూళ్లను రాబట్టయి.

ప్రభాస్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన బాహుబలి ఫస్ట్ పార్ట్ 6.9 మిలియన్ డాలర్లను రాబట్టింది. ఇక ఆ కథకు సీక్వెల్ గా వచ్చిన బాహుబలి సెకండ్ పార్ట్ 12 మిలియన్ డాలర్స్ ని అందుకుంది. ఇక ఇప్పుడు సాహో కూడా అదే తరహాలో కలెక్షన్స్ ని అందుకుంటోంది. 3 మిలియన్ డాలర్స్ ని అందుకున్న సాహో ఆదివారం పాజిటివ్ ఓపెనింగ్స్ తో స్టార్ట్ అయ్యింది. సుజిత్ డైరెక్ట్ చేసిన సాహో చిత్రాన్ని 300 కోట్ల భారీ బడ్జెట్ తో యూవీ క్రియేషన్స్ నిర్మించింది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here