విజయ్ సేతుపతి సినిమాలో జగ్గూ భాయ్

0
699

టాలీవుడ్ సీనియర్ యాక్టర్ జగపతి బాబు మరో డిఫరెంట్ క్యారెక్టర్ తో తమిళ్ ఆడియెన్స్ ని మెప్పించేందుకు సిద్ధమయ్యారు. విజయ్ సేతుపతి నిర్మిస్తున్న ప్రయోగాత్మక చిత్రంలో నటించేందుకు జగపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కోలీవుడ్ సక్సెస్ ఫుల్ దర్శకుడు ఎస్పీ.జననాథన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి సొంత ప్రొడక్షన్ హౌజ్ లో లాభం అనే సినిమాను నిర్మిస్తున్నారు.

ఇంతకుముందు ఈ కాంబినేషన్ లో వచ్చిన పురంబోకు మంచి విజయాన్ని అందుకుంది . ఇక ఇప్పుడు స్క్రిప్ట్ నచ్చి విజయ్ సినిమా కోసం స్టార్ యాక్టర్స్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాడు. శృతి హసన్ కథానాయికగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్ లో మరో హీరోయిన్ గా సాయి ధన్షీక నటిస్తోంది. ఇక ఇప్పుడు జగ్గూభాయ్ కూడా ఈ సినిమా యూనిట్ తో కలవనున్నారు. సైరా సినిమాలో విజయ్ సేతుపతి – జగపతి బాబు కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here