దేశవ్యాప్తంగా టాలీవుడ్ స్థాయిని పెంచేందుకు మరో టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ విడుదలకు సిద్ధమైంది. మెగాస్టార్ కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన సైరా తెలుగుతో పాటు అక్టోబర్ 2న తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఫైనల్ గా సినిమా రెగ్యులర్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది.
ముంబైలో ఇటీవల మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా సైరా టీజర్ ని రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కి మెగా టీమ్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. నార్త్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేసే విధంగా మీడియాతో ఇంటర్వ్యూలు అలాగే ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రమోషన్స్ జెట్ స్పీడ్ లో అవ్వాలని మెగాస్టార్ ప్రిపేర్ అవుతున్నారు. అమితాబ్ బచ్చన్ సినిమాలో కీలక పాత్రలో కనిపించడంతో హిందీ ఆడియెన్స్ కూడా సినిమా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


