ధనుష్ హీరోగా కలైపులి ఎస్ థాను నిర్మాతగా వి క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న లేటెస్ట్ తమిళ మూవీ అసురన్. వెక్కై అనే తమిళ నవల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇటీవల రిలీజ్ అయి సినిమాపై మంచి క్రేజ్ తీసుకువచ్చాయి. ధనుష్ పక్కా మాస్ క్యారెక్టర్ లో నటిస్తున్న ఈ సినిమాకు వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తుండగా మలయాళ నటి మంజు వారియర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమా అధికారిక ట్రైలర్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది సినిమా యూనిట్.
మాస్ స్టైల్ యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాల కలగలుపుగా సాగిన ఈ ట్రైలర్ లో ‘వాళ్ళు మన దగ్గర భూములుంటే ఆక్రమిస్తారు, డబ్బులుంటే దోచుకుంటారు, అదే మన దగ్గర మంచి విద్య కనుక ఉంటె, ఎప్పటికీ దానిని మన నుండి లాక్కోలేరు’ అంటూ ధనుష్ చెప్పే పలు డైలాగ్స్ తో పాటు హై వోల్టేజ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో సాగిన ఈ ట్రైలర్ ఆసక్తి రేపుతోంది. జివి ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమాకు ఫైట్స్ పీటర్ హెయిన్స్ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు. కాగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రానుంది సినిమా యూనిట్….!!


