రేపు ట్రైలర్ తో రానున్న’వాల్మీకి’

0
245
Varun Tej Valmiki Trailer Tomorrow

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కమర్షియల్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వాల్మీకి. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్, మరియు రెండు సాంగ్స్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి వీక్షకుల నుండి మంచి రెస్పాన్స్ సంపాదించడం జరిగింది. జిగర్తాండ అనే తమిళ సినిమాకు అధికారిక రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఫస్ట్ టైం గని అలియాస్ గద్దలకొండ గణేష్ అనే ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ లో నటిస్తున్నారు.

తమిళ నటుడు అధర్వ మురళి, మృణాళిని రవి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని రేపు సాయంత్రం 4 గంటలకు రిలీజ్ చేయబోతున్నట్లు సినిమా యూనిట్ కాసేపటి క్రితం ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఆకట్టుకునే కథ, కథనాలతో పాటు అలరించే మంచి కమర్షియల్ హంగులతో దర్శకుడు హరీష్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here