ప్రేమంటే భయం లేదు..

0
886

భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన కీయరా అద్వానీ సక్సెస్ ఫుల్ ఎంట్రీ ఇచ్చి ఆ వెంటనే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ వినయ విధేయ రామలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక రీసెంట్ గా బాలీవుడ్ లో కబీర్ సింగ్ తో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న అమ్మడు రీయల్ లైఫ్ లో ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని వివరించింది.

సాధారణంగా చాలా వరకు హీరోయిన్స్ ప్రేమ గురించి ప్రస్తావన వస్తే అంత సమయం లేదని ఎదో ఒక ఆన్సర్ ఇస్తుంటారు. కానీ కీయరా మాత్రం ప్రేమించడానికి చాలా సమయం ఉందని అంటోంది. కెరీర్ పై భయంతో కొంతమంది ప్రేమను దూరం పెడతారంటూ.. ప్రేమిస్తే సినీమలపై ఇంట్రెస్ట్ తగ్గుతుందనే భయం తనకు మాత్రం లేదని ధైర్యంగా చెప్పింది. “ప్రేమ అనేది ఎప్పుడైనా ఎవరిమీదైనా పుట్టవచ్చు. కానీ ఇప్పుడు నేనైతే ప్రేమలో లేను. నా మనసు ఖాళీగా ఉంది. ఒకవేళ ప్రేమలో పడితే నేనైతే దాచుకొను ప్రేమ అనేది పూర్తిగా వ్యక్తిగతం” అని కీయరా అద్వానీ నిర్మొహమాటంగా ప్రేమ గురించి తన అభిప్రాయం చెప్పింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here