ప్రస్తుతం టాలీవుడ్ లో యువ హీరోలు సొంత స్టైల్ లో డిఫరెంట్ గా సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు. అందులో నవీన్ పోలిశెట్టి కూడా ఉన్నాడు. రీసెంట్ గా నవీన్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బాలీవుడ్ లో చిచ్చోరె సినిమాతో కూడా విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నాడు.
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో నెగిటివ్ రోల్ తో ఇండస్ట్రీకి పరిచయం అయిన నవీన్ 1:నేనోక్కడినే సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు. అనంతరం ఎక్కువగా హిందీ సీరియల్స్ – వెబ్ సిరీస్ లలో కనిపించి నార్త్ ఆడియెన్స్ కి దగ్గరయ్యాడు. ఫైనల్ గా దంగల్ దర్శకుడు తెరకెక్కించిన చిచ్చోరె సినిమాలో అవకాశం అందుకుని మంచి నటనను కనబరిచాడు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిచ్చోరె సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ – శ్రద్దా కపూర్ లీడ్ రోల్ లో నటించగా నవీన్ సపోర్టింగ్ రోల్ లో కనిపించాడు.


