జయలలిత బయోపిక్ కోసం కంగనా భరత నాట్యం

0
583

సౌత్ ఇండియాలో నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న జయలలిత కాన్ఫిడెన్స్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పట్టుబడితే ఎలాంటి పాత్రలైనా అలవోకగా తెరపై ఆవిష్కరిస్తారు. ఆ పట్టుదల రాజకీయాల్లో కూడా చూపించి ఎన్నో విజయాలను అందుకున్నారు. మరి అలాంటి మహిళ బయోపిక్ లో జయలలితగా కనిపించాలి అంటే కంగనా ఎంత కష్టపడాలి?

అందుకే ఆమె స్పెషల్ గా అన్ని కళల వైపు అడుగులు వేస్తున్నారు. క్లాసికల్ స్టైల్ లో డ్యాన్స్ లపై అలాగే భరత నాట్యంపై పట్టు సాధిస్తోంది. త్వరలో 100 మంది బ్యాక్ గ్రౌండ్ డ్యాన్సర్స్ తో సినిమాకు సంబంధించిన స్పెషల్ క్లాసికల్ సాంగ్ ని షూట్ చేయనున్నారు. అందుకోసం కంగనా రనౌత్ రెగ్యులర్ గా భరతనాట్యం తరగతులకు హాజరవుతున్నారు. సినిమాలో ఆ సాంగ్ హైలెట్ కానున్నట్లు సమాచారం. ఏఎల్.విజయ్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో జయ పుట్టినప్పటి నుంచి ఆమె ముఖ్యమంత్రి అయ్యే వరకు కథ నడుస్తుందని నిర్మాత విష్ణు ఇందూరి తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here