సూర్య కోసం తరలివచ్చిన అభిమాన లోకం

0
709

కోలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన సూర్య తనని చూడడానికి ఎవరు వచ్చినా పలకరించడం అతని నైజం. అందుకే టాలీవుడ్ ఆడియెన్స్ కూడా ఈ స్టార్ హీరోని అంతగా ఇష్టపడతారు. ఇక రీసెంట్ గా మధురై లో చాలా ఏళ్ల తరువాత సూర్య ‘సూరరై పోట్రు’ షూటింగ్ ద్వారా అభిమానులకు దర్శనమిచ్చారు.

2003లో బాలా డైరెక్షన్ లో చేసిన శివపుత్రుడు అనంతరం ఇన్నాళ్లకు సూర్య ఆ ప్రాంతంలో కనిపించేసరికి వేల సంఖ్యలో జనాలు షూటింగ్ స్పాట్ కి వచ్చారు. తమిళ్ లో స్టార్ హీరోలు ఎవరైనా సరే మధురై వెళితే అక్కడి అభిమానులను స్పెషల్ గా కలుసుకోవడం అలవాటు. ఇక సూర్య కూడా అలానే వీలైనంత వరకు అభిమానులను కలుసుకొని దాదాపు 800 మందితో ఫొటోలు, సెల్ఫీలకు పొజిచ్చారు. అభిమానులను ఓపికతో కలుసుకోవడంలో సూర్య ఒక రికార్డు క్రియేట్ చేశాడని చెప్పవచ్చు. గురు సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సుధా కొంగర ‘సూరరై పోట్రు’ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here