చదువు మధ్యలోనే ఆగిపోయింది

0
649
సాహో సినిమాతో హిందీలోనే కాకుండా దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రద్దా కపూర్ ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో సుశాంత్ రాజ్ కథానాయకుడిగా తెరకెక్కిన ఆమె హిందీ చిత్రం ‘ఛిచ్చోరె’ ఈ నెల 6న విడుదల కానుంది.  ఇక ప్రమోషన్ లో భాగంగా ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో శ్రద్ద తన ఎడ్యుకేషన్ గురించి వివరించింది.
“అమెరికా బోస్టన్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఇండియాకు రాగానే ఆఫర్స్ చాలా వచ్చాయి. అవి జస్ట్ ఆడిషన్స్ మాత్రమే. ముందుగా చదువయ్యాకే నటనపై ద్రుష్టి పెట్టాలి అనుకున్నా కానీ మనకు ఏ పని ఇష్టమో అందులో వీలైనంతవరకు ముందుకు సాగాలి. అప్పుడే సంతోషంగా ఉండగలం. మనసుకు నచ్చి తొందరగా నటిని అయ్యా. అందుకే చదువును మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది” అని సాహో బ్యూటీ వివరణ ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here