ఫోటో మొమెంట్ : డైరెక్టర్ హరీష్ శంకర్ తో బ్రహ్మానందం గారు…..!!

0
567
టాలీవుడ్ ప్రఖ్యాత కమెడియన్ బ్రహ్మానందం గారికి ఇటీవల హార్ట్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ తరువాత కొన్నాళ్లపాటు ఇంటివద్దనే ఉండి రెస్ట్ తీసుకున్న బ్రహ్మనందం గారు, ఆపై మళ్ళి నటించడం ప్రారంభించి, కొంత సెలెక్టీవ్ గా సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇక ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా మాస్ సినిమాల దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ వాల్మికీలో బ్రహ్మానందం గారు ఒక కామెడీ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు సమాచారం.
ఇకపోతే నేడు వాల్మీకి సినిమా లాస్ట్ డే షూట్ సందర్భంగా దర్శకుడు హరీష్ శంకర్, బ్రహ్మానందం గారితో కలిసి భోజనం చేస్తున్న ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఎంతమందికో ఈ అదృష్టం, తెలుగు సినిమాకు రుణపడి ఉంటాను, వాల్మీకి షూటింగ్ ఆఖరిరోజు ఎన్నో అద్భుతాలతో ముగిసింది అంటూ హరీష్ తన పోస్ట్ లో తెల్పడం జరిగింది. వరుణ్ సరసన పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో తమిళ నటుడు అథర్వ మురళి ఒక ముఖ్యపాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికె రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్, మరియు వీడియో సాంగ్ ప్రోమోకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది. కాగా ప్రస్తుతం శరవేగంగా నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా, ఈనెల 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here