అందుకే సినిమాలు చేయడం లేదు

0
247
క్యారెక్టర్ ఏదైనా మనసుకు గుర్తిండిపోయేలా నటించడం ఎల్బీ శ్రీరామ్ గారి ప్రత్యేకత. ఎన్నో సినిమాల్లో నటించి, కథా రచయితగా కూడా పని చేసిన ఆయన గత కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎల్బీ శ్రీరామ్ ప్రస్తుతం సినిమాల్లో నటించకపోవడానికి గల కారణాలను తెలియజేశారు.
“చాలా వరకు నాతో కాంబినేషన్ సెట్టయ్యే కమెడియన్స్ ఇప్పుడు లేరు.  గతంలో 10 సినిమా చేస్తే అందులో రెండు సెంటిమెంట్ పాత్రల్లో నటించే అవకాశం వచ్చేది. కామెడీ ట్రాక్ లు ఇప్పుడు కనిపించడం లేదు. చాలా వరకు జనాలు నన్ను కమెడియన్ గా మర్చిపోవడంతో ఎమోషనల్ గా ఉండే పాత్రలకు పిలుస్తున్నారు. అలాంటి పాత్రలు చేసి చేసి విరక్తి వచ్చి అవకాశాలు వచ్చినా కూడా చేయనని చెప్పేశా. డిఫరెంట్ గా ఉండే రోల్స్ ఆఫర్ చేస్తే తప్పకుండా నటిస్తా” అని ఎల్బీ శ్రీరామ్ వివరణ ఇచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here