యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఎనర్జిటిక్ స్టార్ రామ్ మూవీస్….!!

0
846
టాలీవుడ్ లో ఎనర్జిటిక్ స్టార్ గా పేరుగాంచిన హీరో రామ్, ఇటీవల డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్ మూవీ లో నటించడం జరిగింది. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, తొలిరోజు తొలిఆట నుండి సూపర్ హిట్ టాక్  సంపాదించి,అద్భుతమైన కలెక్షన్స్ దక్కించుకుంది. ఇకపోతే నేడు రామ్ నటించిన మూడు సినిమాలు యూట్యూబ్ లో 100మిలియన్ల వ్యూస్ సాధించి అద్భుతమైన రికార్డు ని సొంతం చేసుకున్నాయి.
రామ్ నటించిన నేను శైలజ(సూపర్ ఖిలాడీ3), హలో గురు ప్రేమ కోసమే (దందార్ ఖిలాడీ), ఉన్నది ఒక్కటే జిందగీ (నెంబర్ 1 దిల్వాలా) సినిమాలు ఇటీవల హిందీలో డబ్బింగ్ అయ్యాయి. ఇక నేటితో నెంబర్ 1 దిల్వాలా కూడా 100 మిలియన్ల వ్యూస్ దక్కించుకోగా, మొత్తం ఈ మూడు సినిమాలతో 100 మిలియన్లకు పైగా యూట్యూబ్ వ్యూస్ సాధించిన హీరోగా రామ్ సరికొత్త రికార్డుని నెలకొల్పారు. కాగా ఈ రికార్డు తమ హీరోకు దక్కడంతో ప్రస్తుతం రామ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆనందంతో కామెంట్స్ చేస్తున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here