రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై భారీ ఖర్చుతో తెరకెక్కిన సాహో సినిమా, మూడు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి, మంచి టాక్ ను సంపాదించింది. హాలీవుడ్ రేంజ్ విజువల్స్, అద్బుతమైన యాక్షన్ సన్నివేశాలు, ఫైట్స్, రొమాన్స్ ప్రధానంగా రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధ కపూర్ తొలిసారి ప్రభాస్ తో కలిసి జోడికట్టడం జరిగింది. తెలుగుతో పాటు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసారు.
ఇక రిలీజ్ అయిన తొలిరోజు నుండి అద్భుతమైన కలెక్షన్ల సాధిస్తున్న ఈ సినిమా, నేటితో మొత్తం నాలుగు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.330 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్ ని కొల్లగొట్టినట్లు కాసేపటి క్రితం నిర్మాతలు ఒక ప్రకటన రిలీజ్ చేయడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో సాహో మరింతగా దూసుకెళ్లి, నిర్మాతలకు లాభాలు కురిపించే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు….!!


