నవంబర్ లో స్టార్ట్ కానున్న బాలీవుడ్ జెర్సీ

0
1155
క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన జెర్సీ సినిమా నాని కెరీర్ లో డిఫరెంట్ హిట్ గా నిలిచింది. మళ్లీ రావా సినిమాతో దర్శకుడిగా పరిచయమైన గౌతమ్ తిన్ననూరి ఆ చిత్రంతో తన పూర్తి టాలెంట్ ని బయటపెట్టాడు. అయితే గత కొంత కాలంగా జెర్సీ రీమేక్ కి సంబందించిన వార్తలు వైరల్ అవుతున్నాయి.
ముఖ్యంగా బాలీవుడ్ లో షాహిద్ కపూర్ నటించనున్నట్లు టాక్ వచ్చింది. ఫైనల్ గా వార్త నిజమైంది. లీడ్ రోల్ లో షాహిద్ మరో తెలుగు రీమేక్ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఇక జెర్సీ రీమేక్ నవంబర్ లో సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం. ఇంకా హీరోయిన్ ని అలాగే ఇతర టెక్నీషియన్స్ ని ఫైనల్ చేయాల్సి ఉంది. అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ తో సక్సెస్ అందుకున్న షాహిద్ ఇప్పుడు జెర్సీతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here