స్వార్ధమే.. కానీ అసూయా పెంచుకొను: పూజా హెగ్డే

0
540
ముకుందా సినిమాలో హోమ్లీ గర్ల్ గా టాలీవుడ్ ని మెప్పించిన పూజా హెగ్డే చాలా కాలం తరువాత మళ్ళీ వరుణ్ తేజ్ తో వాల్మీకి అనే సినిమా ద్వారా స్క్రీన్ షేర్ చేసుకుంటోంది. అలాగే ప్రభాస్ తో కూడా ఓ సినిమా చేస్తోన్న ఈ బ్యూటీ తన కెరీర్ గురించి ఇటీవల పలు విషయాలు మీడియాతో పంచుకుంది.
“ఏవైనా మంచి సినిమాలు వస్తే అందులో కథానాయిక పాత్ర నచ్చితే..  నేను నటిస్తే బావుండు కదా అని అనుకుంటా. వీలైతే అన్ని సినిమాల్లో హీరోయిన్స్ పాత్రల్లో కనిపించాలని అనుకుంటా. అవును నాకు స్వార్ధం ఎక్కువే. యాక్టింగ్ కెరీర్ లో అది అవసరం కూడా. కానీ ఎవరైనా మంచిగా నటిస్తే వెంటనే ఫోన్ చేసి అభినందిస్తా. అసూయా పెచ్చుకొను. ఇంకా నా సినీ కెరీర్ చాలా ఉంది. అప్పటివరకు నాకు నచ్చిన పాత్రలు వస్తాయి అనుకుంటున్నా” అని ఈ మహర్షి భామ వివరణ ఇచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here