RRR కోసం చరణ్ ప్రాక్టీస్ సెషన్స్

0
370
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల సైరా పనులతో అలాగే కుటుంబ సభ్యులతో చాలా బిజీగా కనిపించాడు. మెగాస్టార్ , పవర్ స్టార్ పుట్టినరోజు వేడుకలను కూడా సెలెబ్రేట్ చేసుకున్న రామ్ చరణ్ ఇక నెక్స్ట్ పూర్తిగా కొన్ని వారాల వరకు RRR షూటింగ్ తో బిజీ కానున్నాడు. ఇటీవల రాజమౌళి ఎన్టీఆర్ కు సంబందించిన సన్నివేశాల కోసం బల్గెరియా వెళ్లిన విషయం తెలిసిందే.
ఆ షెడ్యూల్ అనంతరం అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న రామ్ చరణ్ కి సంబందించిన మరో షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నారు. అయితే ఈ షెడ్యూల్ కోసం ముందుగానే మెగా తనయుడు ప్రాక్టీస్ సెషన్ లో పాల్గొంటున్నాడు. షూటింగ్ స్పీడ్ గా ఫినిష్ చేసేందుకు చిత్ర నటీనటులు ఎప్పటికప్పుడు వర్క్ షాప్ లో పాల్గొంటూ అనుకున్న సమయానికి పని పూర్తి చేస్తున్నారు. పక్కా ప్లాన్ తో ముందుకు సాగుతున్న రాజమౌళి వచ్చే ఏడాది జులై 30న RRR సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here