రిలీజ్ కు సిద్దమైన తమిళ్ అర్జున్ రెడ్డి

0
576

టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సెట్ చేసిన అర్జున్ రెడ్డి కథ తమిళ్ లో కూడా బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవడానికి సిద్ధమైంది. బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రిలీజయ్యి ఊహించని కలెక్షన్స్ తో ఈ ఏడాది అత్యధిక లాభాలను అందించిన చిత్రంగా నిలిచిన అర్జున్ రెడ్డి కథ ఇప్పుడు అదే తరహాలో కోలీవుడ్ ఆడియెన్స్ ని ఎట్రాక్ట్ చేయడానికి రెడీ అయ్యింది.

విక్రమ్ తనయుడు ధృవ్ మొదటిసారి కథానాయకుడిగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి రీమేక్ ఆదిత్య వర్మ నవంబర్ 8న విడుదల కానున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా తెలియజేసింది. సందీప్ వంగా శిష్యుడు గిరీశ‌య్య‌ తెరకెక్కించిన ఈ సినిమా టీజర్ కి ఇటీవల మంచి స్పందన దక్కింది. ఇక రిలీజ్ డేట్ పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో చిత్ర యూనిట్ ఫైనల్ క్లారిటీ ఇచ్చేసింది. రధన్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాను రవి కె చంద్రన్ నిర్మిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here