ట్రైలర్ తో సిద్దమవుతున్న ప్రస్థానం

0
622

టాలీవుడ్ లో ఊహించని విధంగా ప్రశంసలు అందుకున్న ప్రస్థానం సినిమా ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. సంజయ్ దత్ ఎంతో ఇష్టంగా నిర్మిస్తూ నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ నుంచి ఆడియెన్స్ లో స్పెషల్ ఎట్రాక్షన్ ని క్రియేట్ చేస్తోంది. ఇక సినిమా ట్రైలర్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు.

ఆగస్ట్ 29న సినిమాపై అంచనాలు పెరిగేలా దర్శకుడు దేవ కట్టా ట్రైలర్ ను రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. తెలుగులో సాయి కుమార్ నటించిన పాత్రలో హిందీ ప్రస్థానంలో సంజయ్ దత్ నటిస్తున్నాడు. మనిషా కొయిరాలా – జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 20న గ్రాండ్ గా విడుదల కానుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here