కాంచన సినిమాతో సౌత్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న రాఘవ లారెన్స్ అదే కథను బాలీవుడ్ లో లక్ష్మి బాంబ్ గా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ కథానాయకుడిగా నటిస్తున్న ఆ రీమేక్ సినిమా షూటింగ్ ఇటీవల మొదలైంది. అయితే సినిమా రిలీజ్ డేట్ పై స్పెషల్ అప్డేట్ వెలువడింది.
సినిమా ఈద్ కానుకగా 2020 మే 22న రిలీజ్ కానున్నట్లు తెలిసింది. ఇక అక్షయ్ కుమార్ సరసన సినిమాలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటించనుంది. సౌత్ ఇండస్ట్రీలో మంచి లాభాలను అందించిన ఈ హారర్ కామెడీ ఫిల్మ్ నార్త్ ఆడియెన్స్ ని ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక సినిమాలో బాలీవుడ్ ఆడియెన్స్ టేస్ట్ కి తగ్గట్టుగా దర్శకుడు లారెన్స్ మేకింగ్ పరంగా కొన్ని మార్పులు చేస్తున్నట్లు సమాచారం.


