కపిల్ శర్మ షో లో ‘సాహో’ టీమ్…!!

0
310
Saaho team at Kapil Sharma Show

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ నటి శ్రద్ధ కపూర్ హీరోయిన్ గా యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త చిత్రం సాహో. ఇటీవల గ్రాండ్ గా ప్రి రిలీజ్ వేడుకను జరుపుకున్న ఈ సినిమాను ఈనెల 30వ తేదీన భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా సోనీ టివిలో ప్రసారమయ్యే ప్రముఖ షోల్లో ఒకటైన ది కపిల్ శర్మ షోలో ప్రభాస్, శ్రద్దల జోడి సహా ఆ సినిమాలో విలన్ గా నటిస్తున్న నీల్ నితిన్ ముకేశ్ కూడా సందడి చేయడం జరిగింది.

అతి త్వరలో టెలికాస్ట్ కానున్న ఈ ఎపిసోడ్ తాలూకు ఫోటోలను ఆ షోకు జడ్జిగా వ్యవహరిస్తున్న అర్చన పురాన్ సింగ్, తన అధికారిక సోషల్ మీడియా మాధ్యమం అయిన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం జరిగింది. నేను మీట్ అయిన స్టార్స్ లో ప్రభాస్ ది స్వీటెస్ట్ స్టార్, అంతేకాదు ఆయన ఎంతో షై పర్సన్ కూడా అంటూ, ఆమె తన ఇన్స్టా లో ఫోటోలు పోస్ట్ చేస్తూ తెలిపారు. కపిల్ తో కలిసి ప్రభాస్, శ్రద్ధ, నీల్ రకరకాల ఫోజుల్లో దిగిన ఫోటోలు, అలానే శ్రద్ధ మరియు నీల్ తో కలిసి తనతో దిగిన ఫోటోలు కూడా పోస్ట్ చేసిన అర్చన, సాహో టీమ్ మా షోకు విచ్చేసి సందడి చేయడం ఆనందంగా ఉందని అన్నారు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here