ఫస్ట్ లుక్ తోనే షాకిచ్చిన బాలీవుడ్ హీరోయిన్

0
417

బాలీవుడ్ లో వరుసగా అవకాశాలను అందుకుంటున్న హీరోయిన్స్ లలో పరిణితి చోప్రా ఒకరు. గ్లామర్ పాత్రల్లో కాకుండా డిఫరెంట్ స్టైల్ లో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అమ్మడికి వెన్నతో పెట్టిన విద్య. ఈ ఏడాది కేసరి సినిమాతో మరోసారి సక్సెస్ బాట పట్టిన పరిణితి మరోసారి తనధైన శైలిలో బాలీవుడ్ ని ఆశ్చర్యపరిచింది.

పరిణితి నటిస్తున్న ది గర్ల్ ఆన్ ద ట్రయిన్ సినిమాకు సంబందించిన ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజయింది. గాయాలతో ఆమె భయపడుతున్నట్లు ఉన్న హావభావాలతో ఉన్న ఆమె ఫోటో నిమిషాల్లో ట్రేండింగ్ లిస్ట్ లోకి చేరిపోయింది. మిస్టరీ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో ముఖ్య పాత్రలో అదితి రావ్ హైదరి నటిస్తున్న ఈ సినిమాకు రిభు దాస్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here