గ్యాంగ్ లీడర్ స్టైల్ లో మెగాస్టార్ కి నాని విషెస్

0
317
Nani Gangleader Birthday Wishes To Megastar

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం గ్యాంగ్ లీడర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సెప్టెంబర్ 13 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్బంగా నాచురల్ స్టార్ నాని మెగాస్టార్ సూపర్ హిట్ గ్యాంగ్ లీడర్ స్టైల్ లో విషెస్ అందించాడు.

మెగాస్టార్ నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాకు సంబందించిన ఆ స్టిల్ ని ఎవరు మరచిపోలేరు. అదే తరహాలో నాని కూడా మెగాస్టార్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఈ షాట్ సినిమాలో కూడా ఉన్నట్లు చెప్పారు. అదే విధంగా మా గ్యాంగ్ లీడర్ ఎల్లప్పుడూ మిరే అని నాని మెగాస్టార్ కి విషెస్ అందించారు. ఇక గ్యాంగ్ లీడర్ సినిమాను విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తుండగా సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here