హ్యాపీ బర్త్ డే టూ మెగాస్టార్ చిరంజీవి..!!

0
496

1978లో ప్రాణం ఖరీదు సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు నటుడిగా ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి , అక్కడినుండి ఒక్కొక్కటిగా వరుసగా సినిమాలు చేస్తూ తన ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుప్రీమ్ హీరోగా, ఆపై మెగాస్టార్ గా తిరుగులేని ముద్రను వేశారు. ఇక నేడు తన 64వ జన్మదినాన్ని పురస్కరించుకుని, నిన్న హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో మెగా ఫ్యామిలీ మెంబెర్స్ మరియు మెగా ఫ్యాన్స్ సమక్షంలో ఆయన జన్మదిన వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహించారు.

ఇటీవల 2016లో తన 150వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో ఆయన మళ్ళి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ సాధించడంతో, మధ్యలో దాదాపు 10 సంవత్సరాల గ్యాప్ వచ్చినప్పటికీ, తనలో చరిష్మా ఏ మాత్రం తగ్గలేదని మెగాస్టార్ ప్రూవ్ చేసారు. ఇక ప్రస్తుతం తన 151వ సినిమాగా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్నారు మెగాస్టార్.

నేడు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని మెగా ఫ్యాన్స్ సహా పలువురు సినిమా ప్రముఖులు సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు. కాగా మెగా ఫ్యాన్స్ నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రక్తదానాలు, అన్నదానాలు, వృద్దులు మరియు అనాధలకు పండ్లు పంపిణీ వంటి పలు సామజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here