పెళ్లి చూపులు సినిమాతో డిఫరెంట్ స్టైల్ లో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న తరుణ్ భాస్కర్ జాతీయ స్థాయిలో అవార్డులను అందుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ఈ నగరానికి ఏమైంది అనే సినిమాతో ఓ వర్గం ఆడియెన్స్ ని ఆకర్షించాడు. ఇక ఇప్పుడు మరో డిఫరెంట్ సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్దమవుతున్నాడు.
ఈ విషయాన్నీ తన ఇన్స్టాగ్రామ్ లో అధికారికంగా ప్రకటించాడు. తదుపరి ప్రకటన త్వరలో.. నెర్వస్‌గా ఉంది అలాగే ఎగ్జైటింగ్‌గానూ ఉందంటూ తరుణ్ భాస్కర్ చేతిలో మైక్ పట్టుకున్న ఫోటోని పోస్ట్ చేశాడు. ఇక ఫాలో వార్స్ కూడా ఆల్ ది బెస్ట్ అంటూ పాజిటివ్ గా విషెస్ అందిస్తున్నారు. మరి మూడవ సినిమాతో ఈ యువ దర్శకుడు ఏ మేజిక్ చేయనున్నాడో చూడాలి.


