ఆగస్ట్ 30న వరల్డ్ వైడ్ గా సాహో సినిమా రిలీజ్ కాబోతోంది. ఈ సందర్బంగా సాహో సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ గా నిర్వహించనున్న సంగతి తెలిసిందే. అయితే వేడుక కోసం చిత్ర యూనిట్ భారీగా ఏర్పాట్లు చేసింది. వేడుకకు అభిమానులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని ముందుగానే అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఎలాంటి సంఘటనలు జరగకుండా సెక్యూరిటీని కూడా పటిష్టంగా సిద్ధం చేశారు. ఈవెంట్ ప్లాన్ పై ఎప్పటికప్పుడు చిత్ర నిర్మాతలు వంశీ – ప్రమోద్ లు ఆరా తీస్తున్నారు. ఆదివారం కరెక్ట్ గా వేడుక 5గంటలకు మొదలుకానుంది. ఈవెంట్ లో సినిమాలో నటించిన ప్రముఖ నటీనటులు అలాగే పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. సుజిత్ దర్శకత్వం వహించిన సాహో సినిమా తెలుగు – తమిళ్ – మలయాళం – హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది.


