సరికొత్త స్టైల్ లో బెల్లంకొండ శ్రీనివాస్

0
790

ఇటీవల రాక్షసుడు సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అదే తరహాలో విజయాలను అందుకోవాలని అడుగులు వేస్తున్నాడు. తనకు సెట్టయ్యే కథలను ఎంచుకొని అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. రీసెంట్ గా బెల్లంకొండ శ్రీనివాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక ఫోటో నెటీజన్స్ ని ఆకట్టుకుంటోంది.

ఫోటోకి తగ్గట్టుగా బెల్లంకొండ మంచి క్యాప్షన్ కూడా ఇచ్చాడు. వెనక్కి తిరిగి చూడకు, నువ్ ఆ దారిలో వెళ్లడం లేదు అని బెల్లంకొండ వారబ్బాయి ఇచ్చిన క్యాప్షన్ లో ఎలాంటి అర్థం ఉందొ అర్థం చేసుకోవచ్చు. మంచి కథలను ఎంచుకుంటు అదే దారిలో వెళ్లాలని తనకు తానే స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. స్టైలిష్ గాగుల్స్ తో ఫిట్నెస్ తో కనిపిస్తున్న సాయి శ్రీనివాస్ త్వరలో బాలీవుడ్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు అతని తండ్రి బెల్లంకొండ సురేష్ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here