సూపర్ స్టార్ రజినీకాంత్ జోష్ కి 44 ఏళ్ళు

0
541

సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే తెలియని వారు ఉండరు. తమిళ సినీ పరిశ్రమ స్థాయిని జాతీయ స్థాయిలోనే కాకుండా భారత దేశం నాలువైపులా పెంచి అందరూ గర్వపడేలా విదేశాల్లో కూడా తన క్రేజ్ ను పెంచుకున్న నటుడు రజినీకాంత్ అలియాస్ శివాజీ రావ్ గైక్వాడ్. మహారాష్ట్ర లో జన్మించిన ఓ కానిస్టేబుల్ కొడుకు బస్ కండక్టర్ నుంచి ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తనదైన స్టైల్ తో జోష్ నింపే స్థాయికి వెళ్లాడు. తలైవా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి నలభై ఏళ్ళు దాటింది.

1975లో ఆగస్ట్ 18న రిలీజైన అపూర్వ రాగంగల్ తమిళ సినిమాతో వెండితెరకు పరిచయమైన రజినీకాంత్ అతి తక్కువ కాలంలోనే సూపర్ స్టార్ అయ్యాడు. చూస్తుండగానే తన సినిమాలతో రాష్ట్రాలనే కాకుండా దేశం మొత్తంలో తన క్రేజ్ ను పెంచుకున్నాడు. బాషా – ముత్తు – అరుణాచలం – నరసింహా – శివాజీ – రోబో వంటి ఎన్నో సినిమాలతో బాక్స్ ఆఫీస్ రికార్డులను బద్దలు కొట్టాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో తలైవా 44 ఇయర్స్ ఆఫ్ రజిని ఇజం కామన్ డిపి వైరల్ అవుతోంది. ప్రస్తుతం రజినీకాంత్ మురగదాస్ డైరెక్షన్ లో దర్బార్ అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here