‘రక్తధార’ టైటిల్ తో మూడవ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న చదలవాడ శ్రీనివాసరావు
ఘనంగా చదలవాడ శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు
ప్రముఖ నిర్మాత శ్రీ చదలవాడ శ్రీనివాసరావు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం రోజు కొల్లూరు ఆయన నివాసం వద్ద పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ పాలకమండిలి సభ్యులు, ఎగ్జిక్యూటివ్ కమెటీ సభ్యులు సీనియర్ ఫిలిం జర్నలిస్టులు అందరూ కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపి పూలబొకేను అందజేసి షాలువాతో సత్కరించారు. దీంతో ఆయన ఎంతో ఆనందంగా జర్నలిస్టులందరికీ అల్పాహారాన్ని అందజేసి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…ఆయన తన మూడవ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నట్లు తెలిపారు. ఆ చిత్రానికి ‘రక్తధార’ అనే టైటిల్‌ను కూడా ఖరారు చేశారు. ఈ చిత్ర షూటింగ్ మొత్తం ఆంధ్రాలో జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఆయనకు ఈనాడు పేపర్ అధినేత రామోజీరావుగారితో ఉన్న అనుబంధం గురించి పంచుకున్నారు. ఓసారి అనకోని సందర్భంలో ఆయన టింబర్ డిపో ప్రమాదంలో పడితే ఆయనను ఆదుకోవడంలో ముందు వరుసలో ఆయన ఉన్నారని గుర్తుచేసుకున్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు ఉమామహేశ్వరావు, వెంకటేశ్వరావు, ప్రభు, సుబ్బారావు, ప్రదీప్, వినాయకరావు, బాలిరెడ్డి, మోహాన్ గోటేటి, నారాయణరాజు మహిళా జర్నలిస్టులు శ్రీమతి భాగ్యలక్ష్మి, శ్రీమతి భవాని ఫిలిం క్రిటిక్స్ అధ్యక్షులు బత్తుల ప్రసాదరావు, కార్యదర్శి సురేష్ కొండేటి, వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్, ఉపకార్యదర్శి శ్రీమతి పర్వీన్ బాబీ, మామిడాల గిరిధర్, కేశవాచారి, కుమార్ స్వామి, రవి గోరంట్ల, నవీన్, అప్పాజీ, రాంబాబు, ఓంప్రకాశ్, సురేష్‌కోసూరి, వల్లూరి రాఘవరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గున్నారు.




