అడివి శేష్ నటించిన ఎవరు సినిమా హౌజ్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ నెల ఆగస్ట్ 15న విడుదలైన ఈ సినిమాకు రోజు రోజుకి కలెక్షన్స్ పెరగడమే కాకుండా సినిమా థియేటర్స్ సంఖ్య కూడా పెరుగుతోంది. మొదటి రోజు పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఎవరు మంచి కాన్సెప్ట్ తో అభిమానుల మనసులను గెలుచుకుంటోంది.
అయితే సినిమా కొన్ని ఏరియాల్లో రిలీజ్ కాకపోవడంతో సినిమాను తమ ఏరియాల్లో కూడా ప్రదర్శించాలనే డిమాండ్ పెరుగుతోంది. అలాగే కొన్ని షోలను కూడా పెంచడానికి చిత్ర యూనిట్ సిద్ధమైంది. యూఎస్ లో కూడా సినిమా డాలర్స్ ను గట్టిగానే అందుకుంటోంది. అడివి శేష్ కెరీర్ లోనే బెస్ట్ యూఎస్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఇక ఈ వీకెండ్ లో సినిమాకు కలెక్షన్స్ గట్టిగానే ఉండడం ఖాయంగా కనిపిస్తోంది .


