రణరంగం సాధిస్తున్న కలెక్షన్ల విషయంలో హ్యాపీగా ఉన్నాం – యంగ్ హీరో శర్వానంద్

0
1804
Sharwanand Telugu Interview About Ranarangam

యంగ్‌ హీరో శర్వానంద్‌ – సుధీర్‌ వర్మ కాంబినేషన్‌లో కాజల్‌ అగర్వాల్‌, కల్యాణి ప్రియదర్శన్‌లు హీరోయిన్స్‌గా సితార ఎంటర్టైన్మెంట్స్‌ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘రణరంగం’ ఆగష్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అనూహ్యమైన ఓపెనింగ్స్‌ సాధించింది. సినిమా మంచి వసూళ్లు సాధిస్తున్న సందర్భంగా హీరో శర్వానంద్‌ ఇంటర్వ్యూ..

రణరంగం సినిమాకు మీ కెరీర్‌ బెస్ట్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయి కదా! ఎలా అనిపిస్తుంది?
– రణరంగం’కు నా కెరీర్‌ బెస్ట్‌ ఓపెనింగ్స్‌ వచ్చినందుకు హ్యాపీగా ఉంది. సినిమా రిలీజైనప్పుడు మార్నింగ్‌ షోకి డివైడ్‌ టాక్‌ వచ్చింది. మ్యాట్నీకి ఫర్వాలేదన్నారు. సెకండ్‌ షోకు వచ్చేసరికి ఎబోవ్‌ యావరేజ్‌ అనే టాక్‌ వచ్చింది. ప్రస్తుతం అక్కడే ఆగింది మున్ముందు మరింత పాజిటివ్‌ టాక్‌ వచ్చి బాగా ఆడుతుందని నమ్ముతున్నా.

ఈ సినిమా రిజల్ట్‌ ఏంటి?
– ఈ రిజల్ట్‌ని ఎలా తీసుకోవాలో అర్థం కావడం లేదు. రివ్యూలు యావరేజ్‌గా వచ్చినా కలెక్షన్లు మాత్రం బాగున్నాయి. ఎప్పుడూ లేనిది బీ, సీ సెంటర్లలో థియేటర్లు హౌస్‌ఫుల్స్‌ అవుతున్నాయి. ఈ సినిమాలో కథేం లేదని నేను ముందు నుంచీ చెబుతూనే ఉన్నాను. కేవలం స్క్రీన్‌ ప్లేని నమ్మి తీసిన సినిమా ఇది. విమర్శకులూ ఇదే విషయం చెప్పారు. నా సినిమా అనేసరికి.. కొత్త కథేదో ఉంటుందని ఆశించారు. వాళ్లంతా కాస్త నిరాశ చెందారు. రివ్యూలు బాగున్నట్టయితే వసూళ్లు మరింత బాగా వచ్చేవి. ఈ సినిమా రిజల్ట్‌ ఏమిటన్నది ఇంకొన్ని రోజులు ఆగితే గానీ తెలీదు.

రణరంగం సినిమాలో మీకు నచ్చిన అంశం ఏంటి?
– ‘పడిపడిలేచే మనసు’ తరువాత ప్రేక్షకులకు ఒక స్క్రీన్‌ప్లే బేస్డ్‌ సినిమా ఇవ్వాలనుకొని, ఒక ప్రాపర్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ తియ్యాలనుకొని ‘రణరంగం’ చేశాం. ఆ విషయంలో 200 శాతం సక్సెస్‌ అయ్యాం. ఇటీవల తెలుగులో వచ్చిన బెస్ట్‌ క్వాలిటీ ఫిల్మ్‌ అని ప్రశంసిస్తుంటే ఆనందంగా ఉంది.

ఈ సినిమాకు మీకు వచ్చిన బెస్ట్‌ కాంప్లిమెంట్‌?
– బెస్ట్‌ కాంప్లిమెంట్‌ అంటే సురేఖ అంటి ఫోన్‌ చేసి చాలా అందంగా ఉన్నావ్‌ అని చెప్పారు. ఇప్పటివరకూ ఈ సినిమాలో చేసినటువంటి మాస్‌ కేరెక్టర్‌ చేయలేదు. ఆ క్యారెక్టర్‌లో నాకు నేనే నచ్చాను. రెండు షేడ్స్‌ ఉన్న కేరెక్టర్‌ను చేసేప్పుడు బాగా ఎంజాయ్‌ చేశాను.

ఈ మాస్‌ క్యారెక్టర్‌ కోసం ఎవరినైనా ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నారా?
– ఫ్లాష్‌బ్యాక్‌లో వచ్చే యంగ్‌ గెటప్‌లో నేను చిరంజీవి గారి ఫ్యాన్‌గా కనిపిస్తానుకాబట్టి అప్పటి ‘ఘరానా మొగుడు’, ‘అల్లుడా మజాకా’ లోని చిరంజీవి గారి మానరిజంస్‌ ట్రై చేశాను. వాటికీ కూడా మంచి అప్లాజ్‌ వస్తుంది.

ఒక ప్యాట్రన్‌ బ్రేక్‌ చేయడానికి డిఫరెంట్‌ మూవీ చేశారు కదా! ఇలానే కంటిన్యూ అవుతారా?
-గతంలో కూడా మీరు చూస్తే’ప్రస్థానం’ తరువాత మళ్ళీ వేరే జోనర్‌లో సినిమా చేశాను. అలాగే ‘శతమానం భవతి’ తరువాత కామెడీ జోనర్‌లో సినిమా చేశాను. ఆలా నేను ఎప్పుడూ ఒకే జోనర్‌కి ఫిక్స్‌ అవను. డిఫరెంట్‌ జోనర్‌లోనే సినిమాలు చేస్తా..

హీరోయిన్స్‌ గురించి?
– ఈ సినిమాలో కల్యాణి, నాకూ మధ్య లవ్‌ స్టోరీ ఇప్పటివరకు నేను చేసిన లవ్‌ స్టొరీలన్నింటి కంటే బెస్ట్‌ అని అంటున్నారు. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్‌ అయ్యింది. అలాగే కాజల్‌ కూడా తన స్క్రీన్‌ ప్రజెన్స్‌తో ఆకట్టుకుంది.

సినిమాలో నిర్మాణవిలువలు హైలెట్‌గా ఉన్నాయి కదా! ప్రొడక్షన్‌ గురించి?
– సితారఎంటర్టైన్‌ మెంట్స్‌ నుండి వచ్చే అన్ని సినిమాలు నిర్మాణ పరంగా చాలా బాగుంటాయి. ఆ విషయంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా జరుగుతున్నప్పుడు వంశీ నాతో చాలా క్లోజ్‌ అయ్యారు. చినబాబు గారు మా నాన్న గారికి సన్నిహితుడు. ఈ సినిమా స్టార్ట్‌ అయినప్పుడు నేను బడ్జెట్‌ గురించి అడగను.. కానీ ఒక మంచి సినిమా తీయండి అని చెప్పారు. అలాగే వంశీ కూడా గత రెండు నెలలుగా సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ బేనర్‌లో వర్క్‌ చేయడం హ్యాపీగా ఉంది. డెఫినెట్‌గా ఈ బేనర్‌లో మంచి మంచి సినిమాలు వస్తాయి. నేను మరోసారి ఈ బేనర్‌లో సినిమా చేయాలనుకుంటున్నాను..

మీ నెక్స్ట్‌ మూవీస్‌ గురించి?
– ’96’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..సగభాగం షూటింగ్‌ పూర్తి అయింది. తరువాత ఒక అద్భుతమైన కథతో ‘ శ్రీకారం’ అనే మూవీ చేస్తున్నాను. అది కూడా షూటింగ్‌ స్టార్ట్‌ అయింది. మీ అందరూ కూడా ఆస్టోరీని ఇష్టపడతారు. అంత మంచి స్టోరీ. నెక్స్ట్‌ తమిళ్‌ తెలుగు బై లింగువల్‌ ఫిలిం చేస్తున్నాను. ఇంకా కొన్ని స్టోరీస్‌ వింటున్నాను ఫైనల్‌ కాగానే పూర్తి వివరాలు తెలియజేస్తాను.. అంటూ ఇంటర్వ్యూ ముగించారు యంగ్‌ హీరో శర్వానంద్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here