మెగాస్టార్ ‘సైరా’ కు వాయిస్ ఓవర్ అందించనున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

0
591

కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారత స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ పాలకులపై 18వ దశకంలో పోరాడి, అప్పటి సీమ ప్రజల గుండెల్లో ఆరాద్యుడిగా నిలిచిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి  జీవిత చరిత్ర ఆధారంగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సైరా సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయిన ఈ సినిమా మేకింగ్ వీడియోకు వీక్షకులు బ్రహ్మరథం పట్టి అత్యధిక వ్యూస్ ని అందించారు. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక భాగం కానున్నట్లు సైరా యూనిట్  ఒక ప్రకటన రిలీజ్ చేసింది.

ఈ సినిమాలో మెగాస్టార్ పోషించిన నరసింహారెడ్డి పాత్ర యొక్క పరిచయాన్ని మరియు ఘనతను తెల్పుతూ పరిచయం చేసే వ్యాఖ్యలను పవన్ నోట వాయిస్ ఓవర్ రూపంలో ప్రేక్షకులు వినబోతునట్లు వారు ఆ ప్రకటనలో తెలియచేయడం జరిగింది. ఈ నెల 20న రిలీజ్ కానున్న ఈ సినిమా టీజర్ కోసం మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకులు సురేందర్ రెడ్డి సమక్షంలో పవన్ ఇప్పటికే తన వాయిస్ ఓవర్ ని అందించిన ఫోటోలను కూడా యూనిట్ పోస్ట్ చేసింది. వారిద్దరూ ఈ విధంగా మెగాస్టార్ 151వ సినిమాకు కలవడం ఆనందదాయకం అని వారు ఆ ప్రకటనలో తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here