నేటితో సక్సెఫుల్ గా 100 రోజులు పూర్తి చేసుకున్న సూపర్ స్టార్ ఎపిక్ బ్లాక్ బస్టర్ ‘మహర్షి’

0
760

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజ హెగ్డే హీరోయిన్ గా, సూపర్ హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వైజయంతి మూవీస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పివిపి వంటి భారీ నిర్మాణ సంస్థల కలయికలో రూపొంది, మే 9న రిలీజైన మహర్షి సినిమా, అద్భుతమైన టాక్ మరియు అత్యద్భుతమైన కలెక్షన్ తో ఎపిక్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.

సూపర్ స్టార్ మూడు విభిన్నమైన తరహా షేడ్స్ ఉన్న పాత్రల్లో నటించిన ఈ సినిమా నేటితో సక్సెస్ఫుల్ గా గాజువాక, చిలకలూరిపేట, ఆదోని కేంద్రాల్లో డైరెక్ట్ గా, గుంటూరు, నెల్లూరు లో షిఫ్ట్ తో మొత్తం 5 కేంద్రాల్లో  100 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా చిత్ర నిర్మాతలు కాసేపటి క్రితం సూపర్ స్టార్ మహేష్ గారికి, దర్శకులు వంశీ పైడిపల్లి గారికి, అభిమానులకు మరియు యూనిట్ మొత్తానికి 100 డేస్ విషెస్ తెల్పుతూ ఒక పోస్టర్ ని తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ చేయడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here