దక్షిణ భారత చలన చిత్ర పరిశ్రమ లో దుల్కర్ సల్మాన్ పేరు తెలియని వారు ఉండరు. మమ్ముట్టి నట వారసుడిగా పరిశ్రమ లో కి అడుగు పెట్టినా కానీ ఆనతి కాలం లో నే తనకంటూ ఓకే ప్రత్యేకమైన స్థానం ఏర్పరుచుకోవడమే కాకుండా దక్షిణాది న తెలుగు, తమిళ భాషల్లో నటించి, బాలీవుడ్ రంగ ప్రవేశం కూడా చేసి అందరి మెప్పు ని పొందాడు. త్వరలో రీతూ వర్మ తో కలిసి ఒక రొమాంటిక్ డ్రామా తో మన ముందుకు రానున్నాడు దుల్కర్.
ఈ సినిమా ని ప్రథమంగా తమిళం లో నిర్మించిన దర్శక నిర్మాతలు, ఇప్పుడు తెలుగు లో కూడా డబ్బింగ్ చేసి విడుదల చేయనున్నారు. తమిళం లో కణ్ణుమ్ కణ్ణుమ్ కొళ్ళైయాడితాల్ అనే పేరు తో విడుదల కానున్న ఈ సినిమా కి తెలుగు లో కనులు కనులను చూసాయంటే అనే టైటిల్ ని ఖరారు చేశారు.
దర్శక దిగ్గజం మణిరత్నం చేసిన దొంగ దొంగది అనే సినిమా లో ఉన్న కనులు కనులను చూసాయంటే అనే పాట నుండి మొదటి మూడు పదాలని ఈ సినిమా కి టైటిల్ గా పెట్టారు. ఆసక్తికరమైన అంశం ఏంటి అంటే, ఈ సినిమా లో ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఒక ముఖ్య పాత్ర ని పోషిస్తున్నారు.
దేసింగ్ పెరియస్వామీ ఈ సినిమా కి దర్శకుడు. త్వరలో ఈ సినిమా కి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడవుతాయి.


