తమిళం లోకి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

0
491

తెలుగు సినిమా పరిశ్రమ లో మల్టీ స్టారర్ చిత్రాల ట్రెండ్ ని తిరిగి ప్రేక్షకులకి పరిచయం చేసిన సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. అడ్డాల శ్రీకాంత్ దర్శకత్వం లో వచ్చిన ఈ సినిమా లో విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో మన అందరికీ తెలుసు. దిల్ రాజు ఈ సినిమా ని నిర్మించారు. సమంత, అంజలి ఈ సినిమా లో హీరోయిన్లు గా నటించారు. ఇప్పటికీ తెలుగు లో అంజలి అంటే అందరికీ ఈ సినిమా లో తను పోషించిన సీత పాత్రే గుర్తొస్తుంది. అలాగే ఈ సినిమా విజయం తో సమంత కూడా స్టార్డం ని అందిపుచ్చుకుంది.

ఈ సినిమా విడుదల అయ్యి దాదాపు గా ఐదేళ్లు కావొస్తుంది. ఈ సమయం లో ఇప్పుడు ఈ సినిమా తమిళం లో డబ్ అవ్వనుంది. నెంజమెల్లం పలవణ్ణం అనే టైటిల్ తో ఈ సినిమా యొక్క తమిళ వర్షన్ ని ఆగస్టు నెల లో ప్రేక్షకుల ముందుకు తీసుకో రానున్నారు నిర్మాతలు.

తమిళం లో మహేష్ బాబు కి, అంజలి కి, సమంత కి మంచి మార్కెట్ ఉంది. వెంకటేష్ అంటే కూడా తెలియని వారు ఎవరూ లేరు కాబట్టి తమిళం లో ఈ సినిమా మంచి విజయం సాధించే ఆస్కారం పుష్కలం గా కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here