కామ్రేడ్ విజయ్‌ను చూసి కన్నీరు పెట్టుకున్న యువతి

0
378

హీరో విజయ్‌ దేవరకొండకు ఎందరో అభిమానులున్న సంగతి తెలిసందే. ఈ క్రమంలో ఓ యువతి విజయ్‌ను చూడగానే భావోద్వేగానికి గురై ఆయన్ను హత్తుకున్న ఆనందంలో ఏడ్చేసింది. ఈ దృశ్యాన్ని అక్కడున్న కొందరు కెమెరాలో బంధించారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే ఇది ‘డియర్‌ కామ్రేడ్‌’ మ్యూజికల్‌ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు విజయ్‌ విమానాశ్రయానికి వెళ్లినప్పుడు తీసిన వీడియోగా తెలుస్తోంది. ఆ అమ్మాయిని ఓదార్చుతూ విజయ్‌ ప్రవర్తించిన తీరు అభిమానుల్ని ఆకట్టుకుంటోంది. ఇక విజయ్ నటించిన డియర్ కామ్రేడ్ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. విజయ్ ప్రస్తుతం క్రాంతి మాధవన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈ సినిమా తరువాత హీరో అనే మరో చిత్రంలో నటించనున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here