కెజిఎఫ్ చాప్టర్ -2 లో ‘అధీర’ గా సంజయ్ దత్

0
580

ఇటీవల కన్నడంతోపాటు దేశవ్యాప్తంగా విడుదలైన అన్ని భాషల్లోనూ సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న సినిమా కెజిఎఫ్ చాప్టర్ 1. రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లో యష్ కు జోడిగా శ్రీనిధి శెట్టి నటించడం జరిగింది. ఇక ప్రస్తుతం దీనికి సీక్వెల్ గా రూపొందుతున్న చాప్టర్ 2 పై దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

ఇకాపోతే చాప్టర్ 1 లో గరుడ బాబాయిగా చెప్పబడే అధీర క్యారెక్టర్ ను కేవలం కొన్ని క్షణాలు మాత్రమే చూపించడం జరిగింది. చాప్టర్ 2 లో ప్రధాన పాత్రగా మారనున్న ఈ క్యారెక్టర్ ను ప్రముఖ బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ పోషిస్తున్నట్లు కెజిఎఫ్ చిత్ర బృందం కాసేపటి క్రితం ప్రకటించారు. బాలీవుడ్ లో ఖల్ నాయక్ గా పేరుగాంచిన సంజయ్ దత్, అధీర పాత్రలో ఎంతో అద్భుతంగా నటిస్తున్నారని అంటోంది సినిమా యూనిట్. ఇక ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here