మన్మధుడు-2 నుండి మెలోడియస్ లిరికల్ సాంగ్ ‘నా…లోన’ విడుదల

0
606

కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా లవ్లీ ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా వస్తున్న మన్మధుడు-2 ట్రైలర్, ఫస్ట్ సాంగ్ ‘ హే మేనిన ‘ ఇప్పటికే యూట్యూబ్ లో విడుదలై వీక్షకుల నుండి మంచి స్పందనను రిసీవ్ చేసుకున్నాయి. నేడు ఈ సినిమాలోని రెండవ పాట ‘నాలోన’ అనే పల్లవితో సాగె లిరికల్ సాంగ్ ని సినిమా యూనిట్ యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది.

హీరోపై హీరోయిన్, తన మనసులోని భావాలను వ్యక్తపరుస్తూ క్లాసికల్ స్టైల్ లో సాగే ఈ సాంగ్ ను సింగర్ చిన్మయి ఎంతో హృద్యంగా ఆలపించారు. చైతన్ భరద్వాజ్ సంగీత సారథ్యంలోని ఈ సాంగ్ కు శుభం విశ్వనాధ్ సాహిత్యాన్ని అందించడం జరిగింది. సీనియర్ నటి లక్ష్మి, ఝాన్సీ, రావు రమేష్, వెన్నెల కిషోర్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా  ప్రస్తుతం శరవేగంగా డబ్బింగ్ కార్యక్రమాలు జరుపుకుంతోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను ఆగష్టు 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు….!!

Click Here For Song

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here