నాచురల్ స్టార్ నాని హీరోగా వెరైటీ కథల దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త సినిమా ‘గ్యాంగ్ లీడర్’. టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుళ్ మోహన్, సీనియర్ నటి లక్ష్మి, శరణ్య తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. యువ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ సినిమాలోని ‘రా రా’ అనే పల్లవితో సాగె సాంగ్ ఇప్పటికే కొద్దిరోజుల క్రితం విడుదలై శ్రోతలను విశేషంగా అలరిస్తోంది.
ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని ఇటీవల యూట్యూబ్ లో విడుదల చేయడం జరిగింది. ఆద్యంతం మంచి ఎంటర్టైన్మెంట్ సన్నివేశాలతో విభిన్న కథాంశాన్ని పరిచయం చేస్తూ సాగిన ఈ టీజర్, ప్రస్తుతం 5 మిలియన్ల వ్యూస్ తో అలానే 1.5 లక్షలకు పైగా లైక్స్ తో యూట్యూబ్ లో విజయవంతంగా దూసుకుపోతోంది. టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచి అంచనాలు రెట్టింపు చేసింది .


