స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా బోయపాటి శ్రీను దర్శకత్వం లో వచ్చిన సినిమా సరైనోడు. 2016 లో విడుదల అయిన ఈ సినిమా పెద్ద విజయం సాధించిన సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ సినిమా ని తర్వాత గోల్డ్ మైన్స్ టెలీ ఫిలిమ్స్ సంస్థ హిందీ లో కి డబ్ చేసి యూట్యూబ్ లో రిలీజ్ చేసింది. అప్పటికే అల్లు అర్జున్ కి హిందీ లో మార్కెట్ ఏర్పడటం తో విడుదల అయిన వెంటనే యూట్యూబ్ లో ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టించింది.
జులై 2018 లో యూట్యూబ్ లో విడుదల అయిన ఈ చిత్రం ఇప్పుడు ఒక కొత్త రికార్డ్ ని సృష్టించే దిశగా అడుగులు వేస్తుంది. 6 లక్షల లైక్స్ తో ఈ సినిమా ఇప్పుడు ఒక కొత్త రికార్డ్ సృష్టించింది. ఇది చూస్తే అల్లు అర్జున్ కి మన తెలుగు లో నే కాకుండా ఇతర భాషల్లో కూడా ఎంత మంచి క్రేజ్ ఉంది అనే విషయం అర్ధం అవుతుంది. అంతే కాకుండా మరి కొద్దీ రోజుల్లో ఈ సినిమా 200 మిలియన్ వ్యూస్ ని కూడా సంపాదించనుంది.
రకుల్ ప్రీత్, క్యాథరీన్ ఈ సినిమా లో హీరోయిన్లు గా నటించారు. థమన్ ఈ సినిమా కి సంగీతం అందించారు.


