జ్యోతిక ‘జాక్ పాట్’ ఫస్ట్ లుక్ రిలీజ్….!!

0
569

తమిళ సూపర్ స్టార్ సూర్య సతీమణి జ్యోతిక మన తెలుగు వారికి కూడా ఎంతో సుపరిచితమే. మెగాస్టార్ సరసన ఠాగూర్, అలానే రవితేజ సరసన షాక్ చిత్రాల్లో నటించిన జ్యోతిక, తన ఆకట్టుకునే నటనతో ఇక్కడ కూడా మంచి పేరు సంపాదించారు. ఇక సూర్యతో వివాహం తరువాత కాస్త సెలెక్టీవ్ గా సినిమాల్లో నటిస్తున్న జ్యోతిక ఇటీవల తమిళనాట నాచియార్, రాక్షసి వంటి విభిన్న తరహా చింతల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ప్రస్తుతం తమిళంలో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం జాక్ పాట్.

ప్రముఖ సీనియర్ నటి రేవతి మరొక ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ సినిమాను తెలుగులో కూడా అదే పేరుతో అనువదిస్తున్నారు. 2డి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై హీరో సూర్య సమర్పణలో కళ్యాణ్ రచన మరియు దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని కాసేపటి క్రితం విడుదల చేసింది సినిమా యూనిట్. విశాల్ చంద్రశేఖర్ సంగీతాన్ని అందించిన ఈ సినిమా ఆడియో, ట్రైలర్ ని రేపు విడుదల చేయనున్నారు. యోగి బాబు, ఆనంద్ రాజ్, మొట్ట రాజేంద్రన్, మన్సూర్ అలీ ఖాన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here