‘డియర్ కామ్రేడ్’ చిత్రాన్ని అభినందించిన డైరెక్టర్ సుకుమార్…..!!

0
498

యువ సంచలన నటుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల కలయికలో రూపొంది, ఎన్నో అంచనాల మధ్య నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం డియర్ కామ్రేడ్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మితం అయిన ఈ సినిమాకు నూతన దర్శకుడు భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. ప్రేక్షకుల అంచనాలను అందుకుని మంచి టాక్ మరియు కలెక్షన్స్ తో ప్రస్తుతం ఈ సినిమా దూసుకుపోతోంది.

ఈ సినిమాను వీక్షించిన ప్రముఖ దర్శకుడు సుకుమార్, తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ఖాతాల ద్వారా వ్యక్తం చేసారు. డియర్ కామ్రేడ్ సినిమా మంచి ఉల్లాసంగా, ఎమోషనల్ గా సాగుతూ మనసును హత్తుకునే మ్యూజిక్ తో సినిమాలో పాత్రలను దర్శకుడు నడిపిన తీరు అద్భుతం. ఇక హీరో, హీరోయిన్లు విజయ్, రష్మిక తమ పాత్రల్లో ఒదిగిపోయి నటించారు. దర్శకుడు భరత్ కమ్మ మరియు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు సహా డియర్ కామ్రేడ్ మూవీ మొత్తానికి సినిమా సక్సెస్ సాధించినందుకు తన తరపున అభినందనలు తెల్పుతూ అయన పోస్ట్ చేయడం జరిగింది…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here