దర్శకుడు వంశీ పైడిపల్లి బర్త్ డే సెలెబ్రేషన్స్ లో సూపర్ స్టార్ మహేష్

0
192

సూపర్ స్టార్ మహేష్ కెరీర్లోని 25వ సినిమాగా, సూపర్ హిట్ దర్శకులు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన మహర్షి సినిమా, ఎపిక్ బ్లాక్ బస్టర్ గా సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ మూడు రకాల షేడ్స్ ఉన్న విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని విశేషంగా అలరించి మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న దర్శకుడు వంశీ పైడిపల్లికి సూపర్ స్టార్ మహేష్ బాబు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియచేసారు. నిన్న రాత్రి వంశీ గారి జన్మదిన వేడుకలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది, ఆయనకు ఈ ఏడాది మరింత ఆనందాన్నివ్వాలి అని కోరుకుంటూ మహేష్ బాబు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా పోస్టు చేయడం జరిగింది. అయన ట్వీట్ కు స్పందించిన వంశీ, థాంక్యూ ఫర్ ఎవ్రిథింగ్ సర్, అంటూ మహేష్ బాబు ట్వీట్ ను రీట్వీట్ చేయడం జరిగింది….!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here