కలర్ ఫుల్ విజువల్స్ మరియు యాక్షన్ సీన్స్ తో అలరిస్తున్న జ్యోతిక ‘జాక్ పాట్’ ట్రైలర్…..!!

0
762

జ్యోతిక ప్రధాన పాత్రలో ప్రస్తుతం రూపొందుతున్న కొత్త సినిమా జాక్ పాట్. జ్యోతిక పవర్ ఫుల్ లేడీ పోలీస్ ఆఫిసర్ పాత్రలో యాక్షన్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు కళ్యాణ్ దర్శకత్వం వహిస్తున్నారు. తమిళంతో పాటు తెలుగులో కూడా డబ్ అవుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ ను నిన్న విడుదల చేయడం జరిగింది.

ఇక ఈ సినిమా ట్రైలర్ ను కాసేపటి క్రితం యూట్యూబ్ లో విడుదల చేసారు.

‘ఆ కొత్తగా వచ్చిన ఎస్సై ప్రభువా, సిఐ సింహాచలమా, ఎస్ పి పరశురామా లేక డిఐజి వెంకటస్వామా…!! వాళ్లలో ఎవరని తెగ టెన్షన్ పడుతున్నారు’ అంటూ నటుడు మన్సూర్ ఆలీ ఖాన్ పలికే డైలాగ్ తో ప్రారంభమయ్యే ఈ ట్రైలర్ లో జ్యోతిక పవర్ ఫుల్ ఫైట్స్ మరియు ఫన్నీ డైలాగ్స్ తో అదరగొట్టారు. మరొక ముఖ్యపాత్రలో నటించిన రేవతి సీన్స్ ట్రైలర్ లో బాగున్నాయి. ‘ఇక ఈ భూమి మీద లేనివాళ్లు అనే పదం లేకుండా చేయొచ్చు’, ‘ఒక మగధీరుడు ఒక బాహుబలి ఒక బాషా’ అని జ్యోతిక పలికే డైలాగ్స్ బాగున్నాయి. ఈ ట్రైలర్ మొత్తం ఆకట్టుకునే ఫన్నీ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలతో అలరించింది. ఆగష్టు 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఆడియో నేడు విడుదల కానుంది…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here