మొదటి రోజు రూ.11.50 కోట్లు కొల్లగొట్టిన విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’

0
381

ప్రస్తుత టాలీవుడ్ క్రేజీ హీరోల్లో ఒకరైన విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ డియర్ కామ్రేడ్, నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ఫుల్ టాక్ తో ముందుకు సాగుతోంది. కెరీర్లో రెండవసారి రష్మిక తో కలిసి విజయ్ జోడికట్టిన ఈ సినిమాకు యువ దర్శకుడు భరత్ కమ్మ తొలిసారి దర్శకత్వం వహించడం జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు సమకూర్చగా, సుజిత్ సారంగ్ ఫోటోగ్రఫీని అందించడం జరిగింది.

ప్రస్తుత సమాజానికి మంచి మెసేజ్ ఇస్తూ, హృద్యమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ మరొక్కసారి తన సహజ నటనతో ప్రేక్షకులను అలరించారు. అలానే తొలిసారి ఒక క్రీడాకారిణి పాత్రలో నటించిన రష్మిక ఆ పాత్రలో ఒదిగిపోయి నటించారని సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సాధారణ ప్రేక్షకులు సహా పలువురు సినిమా ప్రముఖులు సైతం, ఈ సినిమాపై పొగడ్తల జల్లు కురిపిస్తున్నారు. ఇకపోతే ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్న లెక్కల ప్రకారం, నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.11.50 కోట్ల మేర కలెక్షన్ ను సాధించించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మంచి టాక్ తో ముందుకు సాగుతున్న ఈ సినిమా, రాబోయే రోజుల్లో మరింత అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టే అవకాశం అందని అంటున్నారు సినీ విశ్లేషకులు…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here