యూత్ ఫుల్ రొమాంటిక్ స్టయిల్లో సాగిన ‘జోడి’ టీజర్…..!!

0
260

యువ నటుడు ఆది సాయికుమార్ మరియు ఇటీవల జెర్సీ సినిమాతో టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మంచి సక్సెస్ ని అందుకున్న శ్రద్ధ శ్రీనాధ్ కలయికలో రూపొందుతున్న కొత్త సినిమా జోడి. ఇటీవల ఉగాది పండగను పురస్కరించుకుని విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన లభించడం జరిగింది. హీరో ఆది ఇమేజ్ కు తగ్గట్టుగా ఉంటూనే యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రాబోతోంది ఈ జోడి మూవీ. ముఖ్యంగా హీరో, హీరోయిన్ల మధ్య సాగే ప్రేమకథ ఈ చిత్రానికి హైలెట్ గా నిలవబోతోందని అంటోందో సినిమా యూనిట్. ఇక గతంలో వాన, మస్కా, సినిమా చూపిస్త మామ చిత్రాలకు అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన విశ్వనాథ్ అరిగెల ఈ సినిమాతో దర్శకుడుగా పరిచయం అవుతున్నారు.

ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ని కాసేపటి క్రితం యూట్యూబ్ లో విడుదల చేసింది సినిమా యూనిట్. టీజర్ ఆద్యంతం ఆకట్టుకునే రొమాంటిక్, లవ్ సన్నివేశాలతో సాగింది. టీజర్ లో ఆది, శ్రద్ధల జోడీని బట్టి చూస్తుంటే, ఈ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అవుతుందని చెప్పవచ్చు. ‘మా నాన్నకు మైసూర్ పాక్ అంటే చాలా ఇష్టం, అందుకే ఒక ఐదు కేజీలు కొందామని మైసూర్ వెళ్తున్నా’ అంటూ టీజర్లో హీరో ఆది పలికే డైలాగు ఫన్నీగా ఆకట్టుకుంటుంది. అలానే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, క్లాసీ ఫొటోగ్రఫీ వెరసి టీజర్ ని మంచి సక్సెస్ చేసాయి. ఇక ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో మంచి వ్యూస్ తో దూసుకుపోతూ, సినిమాపై మరింత అంచనాలు పెంచింది. ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ జోడీ, త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here