6 రోజుల్లో రూ.56 కోట్ల కలెక్షన్ రాబట్టిన బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్

0
4301

టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఇటీవల వరుసగా విడుదలవుతున్న సినిమాలలో అత్యధిక శాతం సినిమాలు విజయవంతం అవడం ఎంతో శుభపరిణామం అని అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక అటువంటి విజయాల వరుసలో లేటెస్ట్ గా ఎనర్జిటిక్ స్టార్ రామ్, మరియు డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ల కలయికలో భారీ అంచనాలతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇస్మార్ట్ శంకర్ కూడా చోటు సంపాదించింది. తొలిరోజు తొలి ఆట నుండి ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ని సొంతం చేసుకుని ఇప్పటికీ చాలా చోట్ల అద్భుతమైన కలెక్షన్లతో ముందుకు దూసుకెళుతోంది.

రామ్ సరసన నిధి అగర్వాల్, నభ నటేష్ హీరోయిన్స్ గా నటించిన ఈ మాస్ కమర్షియల్ బ్లాక్ బస్టర్ మూవీ, ఇప్పటివరకు విడుదలైన 6 రోజుల్లో రూ.56 కోట్ల గ్రాస్ కలెక్షన్ సంపాదించిందని ట్రేడ్ అనలిస్టులు చెప్తున్నారు. రామ్, పూరీల కాంబినేషన్లో వచ్చిన తోలి సినిమా కావడం, అలానే యూత్ మరియు మాస్ ని ఎంతో ఆకట్టుకునే అంశాలు పుష్కలంగా ఉండడంతో ఈ సినిమా మరీముఖ్యంగా బి,సి సెంటర్లలో మరింత దూసుకుపోతోందని వారు అంటున్నారు. ఇక ప్రస్తుతం ఈ సినిమా దూకుడు చూస్తుంటే, రాబోయే రోజుల్లో మరింతగా కలెక్షన్ రాబట్టే అవకాశాలు కనపడుతున్నాయి…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here