ప్రస్తుతం టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు తొలుత 1999లో తమ శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ తరపున ఒకేఒక్కడు, ఖుషి, ఒక్కడు, ఆది, సఖి వంటి సూపర్ హిట్ సినిమాలను పంపిణీ చేసారు. ఆ తరువాత 2003లో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు నూతనంగా నెలకొల్పిన శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ద్వారా నితిన్ హీరోగా రూపొందిన దిల్ సినిమాతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఇక వారి బ్యానర్ ద్వారా నిర్మితమైన తోలి సినిమానే సూపర్ హిట్ సాధించడంతో అప్పటినుండి ఇప్పటివరకు ఎన్నో విజయవంతమైన సినిమాలను తమ బ్యానర్ పై నిర్మిస్తూ, అలానే డిస్ట్రిబ్యూటర్ గా పంపిణీ చేస్తూ నేడు టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరిగా ఎదిగారు.
ఆయన నెలకొల్పిన శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ సంస్థ నేటితో సక్సెస్ఫుల్ గా 20 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజు గారు సహా ఆ సంస్థ తరపున సహనిర్మాతలైన శిరీష్, లక్ష్మణ్, హర్షిత్ రెడ్డి, మరియు పలువురు టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన పలువురు సాంకేతిక నిపుణులు కాసేపటి క్రితం జరిగిన శ్రీవెంకటేశ్వర ఫిలిమ్స్ 20 ఏళ్ళ వేడుకలో పాల్గొన్నారు. ఇటీవల ఆయన సంస్థ నుండి సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమా ఎపిక్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దిల్ రాజు గారు తమ బ్యానర్ ఫై, మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు, శర్వానంద్ మరియు సమంత కలయికలో 96 అఫీషియల్ రీమేక్, రాజ్ తరుణ్ తో ఇద్దరి లోకం ఒక్కటే, సుధీర్ బాబు మరియు నాని కలయికలో వి, దర్శకుడు వివి వినాయక్ నటుడిగా ఇంట్రొడ్యూస్ అవుతన్న సినిమా, రాజుగారి సోదరుడు శిరీష్ గారి కుమారుడు ఆశిష్ హీరోగా పలుకే బంగారమాయెనా, అలానే అల్లు అర్జున్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ తదితర సినిమాలని నిర్మిస్తున్నారు…..!!