సూపర్ స్టార్ ‘మహర్షి’ పై ప్రశంసలు కురిపించిన మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్…..!!

0
474

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అయన కెరీర్ లోని 25వ సినిమాగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఎపిక్ బ్లాక్ బస్టర్ గా అతిపెద్ద విజయాన్ని అందుకున్న మహర్షి సినిమా పై ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పొగడ్తలు కురిపించిన విషయం తెలిసిందే. నేడు ఈ సినిమాను మాజీ భారత క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ప్రత్యేకంగా వీక్షించడం జరిగింది. ఈ సినిమాపై అయన తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.

ఇవాళ మహేష్ గారు నటించిన మహర్షి సినిమా చూడడం జరిగింది, సినిమా ఎంతో అద్భుతంగా ఉందని, అలానే సినిమాలోని రైతుల సమస్యల గురించి సమాజానికి ఇచ్చిన మెసేజి మన అందరికీ ఎంతో ముఖ్యమైనదని, ఇక ఎప్పటిలాగానే మరొక్కసారి సూపర్ స్టార్ మహేష్ ఈ సినిమాలో కూడా తన అలరించే పెర్ఫార్మన్స్ తో ఆకట్టుకున్నారని అయన పోస్ట్ చేయడం జరిగింది. అయితే గతంలో ఒకవేళ మీ బయోపిక్ తీస్తే ఎవరు మీ పాత్రలో నటిస్తే బాగుంటుందని అనుకుంటున్నారు అని వీలైఖరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా, నా పాత్రలో మహేష్ బాబు గారు నటిస్తే చూడాలని ఉంది అంటూ లక్ష్మణ్ తన మనసులోని మాటను చెప్పిన విషయం అప్పట్లో పెద్ద వైరల్ అయింది…..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here